నేడు గ్రీవెన్స్ పాల్గొననున్న మంత్రి స్వామి

ప్రకాశం: పొన్నలూరు మండల ప్రజల సమస్యల పరిష్కారానికిప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎంఆర్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొంటారని ఎంఆర్ఓ పుల్లారావు తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.