చెరువులో పడి.. వ్యక్తి మృతి

E.G: గోపాలపురం మండలం రాంపాలెంలో వ్యవసాయ పనుల నిమిత్తం చెరువులోకి దిగిన రైతు ఏసులంక బులివెంకన్న (39) ప్రమాదవశాత్తు కాలుజారి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులివెంకన్న మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.