హర్మూజ్‌ సమీపంలో భారతీయుడు మృతి

హర్మూజ్‌ సమీపంలో భారతీయుడు మృతి

హర్మూజ్ జలసంధి సమీపంలో ఓ భారతీయుడు గుండెపోటుతో చనిపోయాడు. రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ సింగ్ అవానా చమురు నౌకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో అవానా నౌక హర్మూజ్‌ సమీపంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఈనెల 18న ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రాకేశ్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.