ముగ్గురిపై బీజేపీ అధ్యక్షుడి దాడి
ADB: నార్నూర్ బీజేపీ అధ్యక్షుడు బిక్షపతి పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ మేరకు బాధితుడు వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి నూతన పెట్రోల్ బంక్‌లో శ్రీధర్, తనపై బండలతో దాడి చేసి తలలు పగల కొట్టాడని వికాస్ ఆరోపించాడు. తమను ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీధర్ తండ్రిపై కూడా దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్నాడు.