VIDEO: దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
AKP: నర్సీపట్నంలో దళిత హక్కుల పోరాట సమితి రెండవ జిల్లా మహాసభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో అబిడ్స్ సెంటర్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం అంటూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.