ABN ఆఫీసుపై దాడిని ఖండించిన IJU

ABN ఆఫీసుపై దాడిని ఖండించిన IJU

NDL: ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ నేతల దాడి ప్రయత్నాన్ని మంగళవారం IJU జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈఎన్ రాజు, ఉపాధ్యక్షుడు జి.కొండప్ప, జాతీయ సమితి సభ్యులు ఎన్.వెంకట సుబ్బయ్య, కె. నాగరాజు తీవ్రంగా ఖండించారు. వార్తపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని సూచించారు. మీడియాపై దాడులు తగవని, బాధ్యులపై చర్యలు తీసుకుని భద్రత కల్పించాలన్నారు.