నేడు పాత వాహనాల వేలం పాట

NZB: సీజ్ చేసిన వాహనాలు వేలం వేస్తున్నట్లు NZB రవాణా శాఖ అధికారులు తెలిపారు. రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన వాహనాలతో పాటు NZB ఆర్టీసీ డిపో–1, 2లో ఉన్న పాత వాహనాలను గురువారం వేలంపాట వేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వర రావు తెలిపారు. వేలంపాట సాయంత్రం 4గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున నగరవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.