చలికాలంలో రోగాలకు దడ పుట్టించే జ్యూస్
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పాలకూర జ్యూస్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ ఎ, సి, కె, బి2, బి, సి, ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. చలికాలంలో పాలకూర జ్యూస్ తాగడం వల్ల రోగాలు రాకుండా నివారించవచ్చు.