రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
SRCL: తంగళ్ళపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తంగళ్ళపల్లి వైపు నుంచి సిరిసిల్ల వైపు బైక్ పై వెళుతున్న రఘునందన్, పర్ష రాములను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.