మహాశివరాత్రి ముస్తాబవుతున్న కీసర గుట్ట టెంపుల్..!

మహాశివరాత్రి ముస్తాబవుతున్న కీసర గుట్ట టెంపుల్..!

HYD శివారు కీసరగుట్ట టెంపుల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి 18 వరకు కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.