తహసీల్దార్ కార్యాలయంలో 'ప్రజావాణి' కార్యక్రమం
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇతర సివిల్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.