హనుమకొండ ప్రజావాణిలో 127 దరఖాస్తులు

హనుమకొండ ప్రజావాణిలో 127 దరఖాస్తులు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమంలో 127 మంది వివిధ అవసరాల నిమిత్తం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రావిణ్యకు ఫిర్యాదులు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ నేరుగా భాగస్వామ్యం పంచుకొని ప్రజల సమస్యలు విన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వైవి గణేష్, ఆర్డీవో రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.