బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు..!
NLG: మిర్యాలగూడ పట్టణం 20వ వార్డు హనుమాన్ పేటకు చెందిన 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఇవాళ BRSలో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత సిద్ధార్థ సమక్షంలో వీరందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం హనుమాన్ పేటలో BRS పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు.