గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

CTR: రామకుప్పం మండలం పోడుచేను గ్రామంలో గంజాయి బ్యాచ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకట మోహన్ తెలిపారు. పోడుచేనుకు చెందిన తిరుపతి(49) ఇంట్లో సోమవారం తనిఖీలు చేయగా 35 గ్రాముల గంజాయి దొరికిందన్నారు. గంజాయి కొనుగోలుకు వచ్చిన తమిళనాడు రాష్ట్రం వానియంబాడీకి చెందిన యువరాజ్, విమల్, పన్నీరు సెల్వాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.