మెదక్‌లో ముమ్మర తనిఖీలు

మెదక్‌లో ముమ్మర తనిఖీలు

MDK: మెదక్ పట్టణంలో బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ పట్టణ పరిధిలో భద్రతా చర్యలలో భాగంగా న్యూ బస్ స్టాప్, ఓల్డ్ బస్ స్టాప్, రైల్వే స్టేషన్, చర్చి ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు, లగేజీలు, వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు.