బుద్ధవనంలో ఎస్పీ పర్యవేక్షణ

బుద్ధవనంలో ఎస్పీ పర్యవేక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదివారం బుద్ధవనాన్ని సందర్శించారు. మహాస్తూపంలో బుద్ధ జ్యోతులు వెలిగించి ధ్యానం చేశారు. అనంతరం బుద్ధవనం విశేషాలపై లఘు చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఎస్పీని ఘనంగా సత్కరించారు.