సదుంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి

సదుంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి

CTR: సదుం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ ఎంపీపీ వెంకటస్వామి కోరారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో దళిత సంఘం నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ నెల 16న మదనపల్లిలో జరగనున్న మాల మహానాడు సభ విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో మాలలు హాజరుకావాలని సూచించారు.