విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

ELR: చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రైతు చిన్నం లక్ష్మీ నారాయణ మొక్కజొన్న చేనులోకి శుక్రవారం రాత్రి వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఇవాళ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.