రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరం మండలం ఠాణేలంక వెళ్లే ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద కొబ్బరి డొక్కలలోడుతో వెళ్తున్న హైచర్ లారీ కింద పడి వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. ముందుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో బైక్ అదుపుతప్పి లారీ కింద పడినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు కూనలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు (46)గా గుర్తించారు.