గర్రెపల్లి మోడల్ స్కూల్లో మాక్ ఎలక్షన్స్

గర్రెపల్లి మోడల్ స్కూల్లో మాక్  ఎలక్షన్స్

PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య ఎన్నికలపై అవగాహన కల్పించడంతోపాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. గోల్డి బల్బీర్ కౌర్, వైస్ ప్రిన్సిపల్ కొండయ్య, ఉపాధ్యాయులు రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.