అక్రమ మొరం తవ్వకాలపై CCS మెరుపుదాడి..!
NZB: నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమ మొరం తవ్వకాలపై CCS సిబ్బంది ఇవాళ మెరుపుదాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 జేసీబీ యంత్రాలు,1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.