కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
SRPT: నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామంలో గల ఆదర్శ పాఠశాల/ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి. భానునాయక్
ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా తరగతులు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠ్యాంశాలను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.