FLASH: సిద్దిపేటలో నగదు పట్టివేత

సిద్దిపేట: జిల్లాలో నంగునూరు మండలంలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ముండ్రాయి వెంకటాపూర్ రహదారిలో ఓ కారులో తనిఖీలు చేయగా సరైన పత్రాలు లేని రూ.2,33,900 నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నగదును ఎన్నికల అధికారికి అప్పగిస్తున్నట్లు ఎంపీడీవో హరిప్రసాద్ తెలిపారు.