కోలగట్లను పరామర్శించిన నాయకులు
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి స్వయాన సోదరుడు కీ.శే కోలగట్ల తమ్మన శెట్టి ఆకస్మిక మరణం పట్ల పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పేడాడ తిలక్, టెక్కలి వైసీపీ సమన్వయకర్త మామిడి శ్రీకాంత్, తదితరులు కోలగట్లను తన నివాసంలో పరామర్శించి, తమ్మనశెట్టి మృతి పట్ల ప్రగాడ సానుభూతి తెలిపారు.