రెండో రోజు 40 శాతం తిరిగిన బస్సులు

రెండో రోజు 40 శాతం తిరిగిన బస్సులు

TG: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అయితే మొదటిరోజుతో పోల్చుకుంటే రెండో రోజు బస్సులు ఎక్కువగానే తిరిగాయి. మొదటి రోజు కేవలం అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే రోడ్లపైకి రాగా.. రెండో రోజు మాత్రం వీటితో పాటు అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా తిరిగాయి.  రెండో రోజు సుమారు 40 శాతం వరకు బస్సులు తిరిగాయని అధికారులు వెల్లడించారు.