మాచవరంలో 'స్వచ్ఛ రథం' ప్రారంభం
PLD: మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ చిరంజీవి బుధవారం 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' లక్ష్యంతో రూపొందించిన ఈ రథం ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తుంది. ప్రజలు తమ వద్ద ఉన్న పొడి చెత్తను, పాత సామాగ్రిని రథానికి అందజేస్తే, దానికి ప్రతిఫలంగా వారికి నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.