'అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలి'
ASF: కెరమెరి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలోనే దేశం ముందుకు సాగాలని ఆత్రం సుగుణ పిలుపునిచ్చారు.