VIDEO: అవగాహనతో సైబర్ నేరాలకు చెక్: ఏఎస్సై

WGL: ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చని ఏఎస్సై పీటర్ తెలిపారు. వర్ధన్నపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని, సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటే బాధితులు హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నెం.1930 కి సంప్రదించాలన్నారు.