వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సరఫరా జరిగేలా చేయాలని అధికారులకు ఆదేశించారు.