నేడు గ్రామ పాలకవర్గ సభ్యులకు శిక్షణ

నేడు గ్రామ పాలకవర్గ సభ్యులకు శిక్షణ

SRD: కంగ్టి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు ( గ్రామ పాలకవర్గ ) సభ్యులకు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ సత్తయ్య, ఎంపీఓ లక్ష్మణ్ తెలిపారు. కావున మండల మొత్తం 280 మందికి గాను 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ఉందన్నారు. గ్రామపంచాయతీ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.