"ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోండి'
MBNR: ఉమ్మడి జిల్లా గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆర్సెటి (RSETI) ఆధ్వర్యంలో బైక్ మెకానిక్, సీసీ కెమెరా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సోమవారం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 23 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. 19-45 ఏళ్ల లోపు వారు ఈ నెల 22లోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99633 69361ను సంప్రదించాలన్నారు.