స్థానిక సమస్యలపై MROకు వినతి

SRPT: నడిగూడెం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు స్థానిక సమస్యలపై MRO రామకృష్ణా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రధానంగా చౌదరి చెరువు వల్ల రహదారి ముంపు, ఎరువుల సరఫరాలో నియంత్రణ లేకపోవడం, తాగునీరు కలుషితం కావడం, కుక్కల-దోమల బెడద, వీధిదీపాల అంశాలపై వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.