సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన MP, MLA
WGL: HNK, WGL, కాజీపేట నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణానికి రూ.5257.20 కోట్లు కేటాయించినందుకు CM రేవంత్ రెడ్డిని ఆదివారం MP, MLAలు, MLC మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా MP కావ్య మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కలను CM నెరవేర్చారని, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ WGL అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.