VIDEO: రావిపాడులో కోడెల విగ్రహ ఆవిష్కరణ
PLD: నరసరావుపేట మండలం రావిపాడులో కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, చింతమనేని ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోడెల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోడెల నిరంతరం ప్రజా సేవలో ఉంటూ పల్నాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నేతలు కొనియాడారు.