జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి: SP

జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలి: SP

ASF: కబడ్డీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన అజ్మీర భరత్‌ బుధవారం ASF SP నితికా పంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన జాతీయస్థాయి అండర్ 19 కబడ్డీ పోటీల్లో జిల్లాకు చెందిన భరత్ బంగారు పతకం సాధించారు. SP మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యతో పాటు క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు.