ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని నేకునాంబాద్ పరిధిలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రంగనాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పునరుద్ధరణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ముఖ ఆధారిత హాజరు విధానం గురించి అవగాహన కల్పించి, హాజరు నమోదు విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పనికి హాజరుకావాలని కూలీలకు సూచించారు.