బేతంచర్లలో తాగునీటి ఎద్దడి

బేతంచర్లలో తాగునీటి ఎద్దడి

NDL: బేతంచెర్ల పట్టణంలో కోటపేట కాలనీ సోమవారం సందర్శించిన మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డికి మహిళలు తమ గోడు వెళ్ళబోసున్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి రూ.351 కోట్లతో పైప్‌లైన్ వేసినా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల వారానికి ఒక్కసారి తాగు నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆయన చూపిన చొరవను గుర్తు చేస్తూ ప్రస్తుత నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.