అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా క్షేమం

MNCL: ఓ గర్భిణీ అంబులెన్స్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన సోమవారం భీమారం మండలం ఆరేపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గర్భిణీ జాడి పుష్పలతకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త సాయి 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు.