VIDEO: 135 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం
NTR: కంచికచర్ల మండలం పరిటాలలోని ఆంజనేయ స్వామి విగ్రహం అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం సుమారు 135 అడుగుల ఎత్తుతో భక్తులను ఆకట్టుకుంటోంది. విగ్రహం బరువు దాదాపు 2,500 టన్నులు. నిర్మాణానికి 25 నెలలు పట్టగా, 14 వేల టన్నుల సిమెంట్, 150 టన్నుల ఇనుము, వెయ్యి లారీల ఇసుక వినియోగించినట్లు అధికారిక సమాచారం.