టీమిండియాలో నెం.4 స్థానం కోసం వేట..?
భారత్ వన్డే జట్టులో కీలకమైన నెంబర్-4 స్థానం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. రెగ్యులర్ నెంబర్-4 బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో, ఈ కీలక స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న తలెత్తింది. అయితే, రిషభ్ పంత్ లేదా తిలక్ వర్మలలో ఒకరు ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.