ప్రమాదకరంగా మారిన వంతెన

ప్రమాదకరంగా మారిన వంతెన

KRNL: సంజామల శివారులోని పాలేరు వాగుపై 20 ఏళ్ల కింద నిర్మించిన లో లెవెల్ వంతెన ప్రమాదకరంగా మారింది. రెండు మూడేళ్లుగా వాగు ఉద్ధృతికి పూర్తిగా దెబ్బతింది. ఈ దారి గుండా కోవె లకుంట్ల, మాయలూరు, అల్లూరు గ్రామాలకు నిత్యం వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు.వెంటనే అధికారులు స్పందించి వంతెన స్థాయి పెంచి నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.