ఘనంగా దొంగలదోపు ఉత్సవం
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ‘దొంగలదోపు’ ఉత్సవం వైభవంగా జరిగింది. తిరువీధి సేవలో స్వామివారిని దొంగలు అడ్డగించి దోచుకున్నట్లు నాట్యరూపంలో చూపించి, అనంతరం మహిమ తెలుసుకుని తిరిగి సమర్పించిన ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యంలో హాజరయ్యారు.