వాహన మిత్ర హామీతో ఆటో డ్రైవర్లలో ఆనందం

SKLM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేస్తామని ఇచ్చిన హామీతో ఆటో డ్రైవర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గురువారం పలాసలో టీడీపీ నేత దువ్వాడ శ్రీకాంత్ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న ఆటో డ్రైవర్లు సంతోషాన్ని తెలిపారు. దసరాకు వాహన మిత్ర పేరిట 15 వేల రూపాయలు మంజూరు చేయటం ఆనందదాయకమని పేర్కొన్నారు.