చెన్నకేశవ స్వామి రథోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

చెన్నకేశవ స్వామి రథోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

PLD: మాచర్లలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చేనెల 7న జరిగే రథోత్సవానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. భద్రత, వైద్యం, విద్యుత్, మైకింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.