'పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి'
W.G: పెనుగొండ గ్రామంలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తామని పెనుగొండ పంచాయతీ ప్రత్యేక అధికారి అప్పారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ద్వారా నిధులు సమీకరణ చేస్తామని, సిబ్బంది పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు.