కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన

కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగుల నిరసన

SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జెఎసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి కి వినతి పత్రం సమర్పించారు. జిల్లా ఛైర్మన్ జావిద్ అలీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పీఆర్సీ ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ అందించాలని కోరారు.