చాముండేశ్వరి ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామసభ

చాముండేశ్వరి ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామసభ

TPT: తడ మండల కొండూరులో నిర్మిస్తున్న చాముండేశ్వరి ఆలయాన్ని నిలిపివేయాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జాతీయ రహదారి పక్కన క్షుద్రపూజలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు గతంలో ఆలయాన్ని కూల్చివేసి ధర్నా చేసిన విషయం తెలిసిందే. కాగా, కొండూరమ్మ దేవాలయం మాత్రమే తమ గ్రామ దేవత ఆలయమని గ్రామస్థులు స్పష్టం చేశారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని అధికారులు తెలిపారు.