VIRAL: వింత చోరీ.. సింహం మాస్క్ దొంగ
AP: అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో వింత చోరీ వెలుగుచూసింది. అర్ధరాత్రి వేళ ఓ కిరాణా షాపులోకి చొరబడిన దొంగ.. గుర్తుపట్టకుండా ఉండేందుకు సింహం ముఖం ఉన్న మాస్క్ ధరించి హల్‌చల్ చేశాడు. షాపులోని నగదుతో పాటు విలువైన సరుకులను ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 'సింహం' మాస్క్ దొంగ కోసం గాలిస్తున్నారు.