అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు
VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలోని సద్గురు దేవానంద మెమోరియల్ పాఠశాలలో ఆదివారం చిన్నారులతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భోగి మంటను పాఠశాల ఛైర్మన్ బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి వెలిగించి సంబరాలను ప్రారంభించారు. పాఠశాల ప్రిన్సిపాల్ దూసి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గోపూజ నిర్వహించారు.