కంగుంది సమీపంలో రోడ్డు ప్రమాదం
CTR: కుప్పం (M) కంగుంది సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంగుంది వైపు నుంచి కుప్పానికి వస్తున్న పాల ట్యాంకర్ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ట్యాంకర్లోని పాలు రోడ్డు పాలయ్యాయి. స్తానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.